mictv telugu

తెలుగు వ్యక్తిని కొట్టిచంపిన తమిళోళ్లు..

November 27, 2018

జనం కోపతాపాలను ఏమాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. జరగరానిది జరిగాక కోర్టుల చుట్టూ తిరిగి జైళ్లలో పడుతున్నారు. తమిళనాడులోని కడలూరులో స్థానికులు ఓ తెలుగు వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో దారుణంగా కొట్టి చంపేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు దెబ్బలకు తట్టుకోలేక ‘కొట్టొద్దు.. నేను చచ్చిపోతాను.. ’ అని తెలుగులో వేడుకున్నా వినకుండా దాడి చేశారు. ఒకరిద్దరు అడ్డుకోవడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. అతణ్ని చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అక్కడికక్కడే చనిపోవడంతో తలోదిక్కూ పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతుడి వయసు 45 ఏళ్లని, అతని వివరాలు తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. దొంగలు, పిల్లలను ఎత్తుకుపోయేవాళ్లు అనే నెపంతో కొన్ని నెలల కింద దేశవ్యాప్తంగా యాచకులను, మతిస్థిమితం లేని వారిని జనం కొట్టి చంపడం తెలిసిందే.

Telugu news Telugu man was beaten to death in Tamil Nadu’s Cuddalore over suspicion of theft. The man was roaming around in a busy market when he was confronted and beaten up by a mob.