mictv telugu

‘గ్యాంగ్ లీడర్’ దర్శకుడు కన్నుమూత

February 12, 2019

చిరంజీవి, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు(86) హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరంజీవితో ఆయన గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెం 786, మగధీరుడు వంటి బ్లాక్ బస్టర్స్‌ని రూపొందించారు.

Telugu News Telugu renowned filmmaker Vijaya bapineedu died at 86.

విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి కాగా చిత్ర పరిశ్రమలో ఆయన విజయ బాపినీడుగా ప్రసిద్ధి చెందారు. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కలచాటపర్రు గ్రామంలో ఆయన జన్మించారు. ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని చేశారు. చిత్రసీమలోకి రావడానికి ముందు ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. ఆయన మృతికి చిత్ర పరిశ్రమకి సంబంధించిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.Telugu News Telugu renowned filmmaker Vijaya bapineedu died at 86