వివాదంలో రష్మి.. డబ్బు పంపినా రానంటోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

వివాదంలో రష్మి.. డబ్బు పంపినా రానంటోంది..

December 8, 2018

తెలుగు బుల్లితెర యాంకర్, నటి రష్మి గౌతమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమానికి వస్తానని డబ్బు తీసుకుని, తర్వాత రానంటున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఈవెంట్‌తొ తనకే సంబంధమూ లేదని రష్మి వాదిస్తున్నారు.

tt

ఆదివారం తిరుపతిలో జరిగే 10k రన్ కార్యక్రమానికి రష్మి హాజరవుతున్నట్టు హోర్డింగ్ పెట్టి ప్రచారం చేశారు. ఇది చూసిన రష్మి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కార్యక్రమ నిర్వాహకులు తనతో మాట్లాడలేదని పేర్కొన్నారు. ‘ఈ ఈవెంట్‌లో నా భాగస్వామ్యం లేదు. నా అనుమతి, ప్రమేయం లేకుండా నా ఫొటోల్ని పెట్టేస్తారు. కార్యక్రమం స్పాన్సర్లు ఎవరైనా తెలిస్తే ఈ వార్త చెప్పండి..’ అని అభిమానులను కోరారు.

దీంతో ఆ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరు సమాధానమిచ్చారు. ‘రష్మికి అడ్వాన్స్‌ డబ్బు కూడా ఇచ్చాం. ఆమె రావడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు కాదంటున్నారు. నేను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపాను.. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని తెలిపారు. దీనికి రష్మి బదులిస్తూ ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నారు. రష్మి అభిమానులు ఆమెకు అండగా ట్వీట్లు పెడుతున్నారు.