ఆ ఆలయంలో ప్రసాదంగా.. ఎవరూ ఊహించనివి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఆలయంలో ప్రసాదంగా.. ఎవరూ ఊహించనివి..

April 23, 2018

ఆలయాల్లో భగవంతుడికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. నైవేద్యం తర్వాత అందులో కొంత భాగాన్ని భక్తులకు అందిస్తారు. లడ్డూ, పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగళి వంటివి ఇస్తుంటారు. అయితే  తమిళనాడు రాజధాని చెన్నైలోని పడప్పయీలో ఉన్న జైదుర్గా ఆలయంలో మాత్రం భక్తులు ఊహించనివాటిని ప్రసాదంగా అందిస్తున్నారు. అక్కడికి భక్తులకు రోజూ బర్గర్, శాండ్‌విచ్‌ల‌ను డబ్బుకు వితరణ చేస్తున్నారు. అందుకే ఈ ఆలయాన్ని హైటెక్ టెంపుల్, అని ఫాస్ట్ ఫుడ్ టెంపుల్ అని జనం అంటున్నారు.  ఈ ఆలయాన్ని స్థాపించిన హెర్బల్ ఆంకాలజిస్టు కే శ్రీధర్ మాట్లాడుతూ…‘నా  అభిప్రాయంలో ప్రసాదం రూపంలో పవిత్రమైన ఏ ఆహారమైనా ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వడం తప్పేమీ కాదు. ఈ మందిరంలో ప్రసాదంగా ఇచ్చే ఆహార పదార్థాలను ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తారు. ఈ ప్రసాదాల ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ కూడా ముద్రిస్తారు. ఆలయంలో ఏర్పాటు చేసిన వెండింగ్ మెషిన్ ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తారు’ ఆయన తెలిపారు.