తెలంగాణలోని వివిధ ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ దేవాదాయ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఆలయాలకు పాలక మండళ్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మండళ్లను ఏర్పాటు చేసిన వాటిలో జయశంకర్ – భూపాలపల్లి జిల్లా మంగపేట్ మండలం మల్లూర్ శ్రీ హేమచల శ్రీ హేమాచా లక్ష్మీనరసింహ స్వామి, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి, నిజామాబాద్ పట్టణం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వంటి ప్రముఖ ఆలయాలతో పాటు చిన్న దేవాలయాలున్నాయి.
జంట నగరాల్లోని సికింద్రాబాద్ ద్వారకానగర్ శ్రీ హనుమాన్ దేవాలయం, హైదరాబాద్ పోచమ్మ బస్తీ శ్రీహనుమాన్ శివసాయిబాబా ఆలయం, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మారుతినగర్ శ్రీఅంజనేయ స్వామి దేవస్థానం, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ కమలానగర్ శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయం, కామారెడ్డి జిల్లా మాచరెడ్డి శ్రీ వీరహనూమాన్, వెంకటేశ్వర స్వామి, చుక్కాపూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ శ్రీ సంతమల్లన్న ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట మండలం ఎక్లాస్ పూర్ శ్రీ బాలాజీ స్వామి దేవాలయం వరంగల్ (రూరల్) జిల్లా పరకాల మండలం మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి శ్రీ పలుగుమీది నల్లపోచమ్మ ఆలయం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది.