కుంభమేళాకు సిద్ధమైన తాత్కాలిక నగరం…

జనవరి 15 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం యాత్రికులు, భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది.  192 దేశాల నుంచి సుమారు 12 కోట్ల మంది వరకూ వస్తున్న ఈ కార్యక్రమ నిర్వహణకై యూపీ సర్కార్ రూ. 2,800 కోట్లను కేటాయించింది. ఇతర నిధులు, ఖర్చులు కూడా కలిపితే, కుంభమేళా నిర్వహణకు పెట్టబోయే ఖర్చు రూ. 4,300 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కుంభమేళా కోసం యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.Telugu news Temporary city ready for Kumbh Mela … The estimated cost of Kumbh Mela is expected to 4,300 crores40 వేల ఎల్ఈడీ బల్బుల కాంతులతో, దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనలు ఈ తాత్కాలిక నగరంలో నిర్మించారు. ఈ ఉత్సవాలకు భద్రతను కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పటికే ప్రారంభమైంది. భక్తులు నది వద్దకు చేరడం, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షిస్తుంది.

అడుగడుగునా సీసీటీవీ నిఘా పెట్టారు. మొత్తం 20 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వర్తించనున్నారని ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాలో భద్రతా విధులు నిర్వహించే పోలీసులు శాకాహారం మాత్రమే తీసుకుంటారని, మద్యం ముట్టుకోరని యూపీ డీజీపీ కేపీ సింగ్ తెలిపారు.Telugu news Temporary city ready for Kumbh Mela … The estimated cost of Kumbh Mela is expected to 4,300 crores