mictv telugu

‘పబ్‌జి’ ఆడండి కోటి రూపాయల ప్రైజ్ మని గెలవండి

January 12, 2019

ప్రపంచంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా యువ‌త‌, పిల్ల‌లు ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఆడుతున్నారు. న‌లుగురు విద్యార్థులు క‌లిస్తే ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో ప‌డి సమయాన్ని మరిచిపోతున్నారు. ఇక గేమ్‌కు మ‌రింత ప్రాచుర్యం పెంచ‌డం కోసం ఆ గేమ్‌ను సృష్టించిన సంస్థ ‘టెన్సెంట్ గేమ్స్’ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌బ్‌జి టోర్న‌మెంట్ల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్న‌ది. అందులో భాగంగానే త్వ‌ర‌లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

టెన్సెంట్ గేమ్స్ కంపెనీ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోతో క‌లిసి త్వ‌ర‌లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019ను నిర్వ‌హించ‌నుంది. ఇందులో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. ఈ టోర్నమెంట్ కొరకు ఈ నెల 10వ తేదీ నుంచి రిజిస్ట్రేష‌న్లు ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ. ఇక‌ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వ‌ర‌కు ఇన్ గేమ్ క్వాలిఫైర్స్ న‌డుస్తాయి. త‌రువాత ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 24 వ‌ర‌కు ఆన్‌లైన్ ప్లే ఆఫ్స్ ఉంటాయి. త‌రువాత మార్చి 10వ తేదీన గ్రాండ్ ఫైన‌ల్స్ ఉంటాయి. ఈ టోర్న‌మెంట్‌లో విజేత జ‌ట్టుకు రూ.30 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ఇస్తారు. రన్నరప్ సాధించిన వారికి రూ.10 ల‌క్ష‌లు, 3వ ప్లేస్‌లో నిలిచిన వారికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తారు. ఇక టాప్ 10 లో నిలిచిన మిగిలిన వారికి కూడా ర్యాంక్‌ను బ‌ట్టి నగదు బహుమతులు ఉంటాయి. అయితే ఈ ప‌బ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 టోర్న‌మెంట్‌లో పాల్గొనాలంటే ముందుగా http://www.pubgmobile.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu News Tencent’s PUBG Mobile Series 2019: Oppo to sponsor pool prize of Rs 1 crore