మన దేశంలో బికినీలు వేసుకోవద్దు.. కేంద్రమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మన దేశంలో బికినీలు వేసుకోవద్దు.. కేంద్రమంత్రి

March 16, 2018

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వచ్చే పర్యాటకులు  ఇక్కడి సంప్రదాయలకు అనుగుణంగా దుస్తులను ధరించాలని పేర్కొన్నారు. ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశీయులు గౌరవించాలని చెప్పారు.  ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ఫోన్స్ మాట్లాడుతూ… ‘విదేశాల్లో బికినీలు వేసుకుని వీధుల్లో తిరుగుతారు. అలానే వారు భారత్ వచ్చినప్పుడు బికినీలు వేసుకోవద్దు. లాటిన్ అమెరికాలో కొన్ని నగరాల్లో అక్కడి మహిళలు బికినీలు వేసుకునే వీధుల్లో తిరుగుతారు.  అక్కడ అది సాధారణ విషయమే. అందులో ఎలాంటి సమస్య లేదు. మనదేశంలోని గోవా బీచుల్లో బికినీల్లో విదేశీయులు కన్పించడం సాధారణమే, కానీ అవే దుస్తుల్లో నగర వీధుల్లో తిరుగుతామంటే ఎంతమాత్రం కుదరదు. మీరు పర్యటిస్తున్న దేశ సంప్రదాయాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలి. స్థానిక  సంప్రదాయాలను గౌరవించాలి. విదేశీయులు భారత్ వచ్చినప్పుడు చీర కట్టుకుని రావాలని చెప్పట్లేదు. మంచి దుస్తులు వేసుకుని వస్తే సరిపోతుంది’ అని ఆల్ఫోన్స్ అన్నారు.

ఆల్ఫోన్స్‌ గతంలోనూ కూడా  విదేశీ పర్యాటకుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. భారత్‌కు వచ్చే విదేశీయులు తమ దేశంలోని బీఫ్‌ను తిని రావాలని సూచించారు.