వెంకయ్యకు ఉగ్ర ముప్పు - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్యకు ఉగ్ర ముప్పు

November 20, 2017

భారత్‌లో ఉగ్రవాదులు భారీ దాడికి కుట్ర చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ సహా కొందరు బీజేపీ నేతలను ఐఎస్ఐ టార్గెట్ చేసిందని  భారత్ నిఘా సంస్థ తెలిపింది. ప్రముఖులు పాల్గొనే భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఢిల్లీలో జరిగే కార్యక్రమాలపైనే ఉగ్రవాదులు దృష్టి పెట్టారని అధికారులు చెప్పారు. గుహవాటి నుంచి వచ్చిన  సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని  అన్ని రాష్ట్రాలకు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.  చైనా సరిహద్దు  వివాదంలో ఈ శాన్య భారతంలో ప్రభుత్వం భారీగా నిఘాను పెంచింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, గోవా  ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.