వరంగల్‌లో టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ...10వేల ఉద్యోగాలు పక్కనట! - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్‌లో టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ…10వేల ఉద్యోగాలు పక్కనట!

February 22, 2018

పెద్ద పెద్ద సద్వులు సద్వి ఉద్యోగాలు రాక ఖాళీగా కూర్చునోళ్లు, ఎన్ని ఆఫీసుల  చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఉద్యోగం రానోళ్లు ఇక మీకష్టాలు తీరినట్టే. త్వరలో వరంగల్‌లో  టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దక్షిణ కొరియాకు చెందిన బట్టల కంపెనీ ‘యంగ్ వన్ కార్పోషన్’  తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 2000 కోట్లతో ఈ బట్టల కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈఫ్యాక్టరీ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా భాగంగా ఈఫ్యాక్టరీ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు.