సచిన్‌కు ధన్యవాదాలు.. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

సచిన్‌కు ధన్యవాదాలు.. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి

March 30, 2018

‘ మైదానం వెలుపల వుండి కూడా మీరు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు ’ అంటూ మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి అభినందించారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ స్కూల్ భవన నిర్మాణానికి సచిన్ టెండుల్కర్ రూ.40 లక్షలు కేటాయించి తన సహృదయతను చాటుకున్నారు. సచిన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వున్నారు.తన ఎంపీ నిధుల కోటా నుంచి ఈ సాయం అందించేందుకు సంసిద్ధత ప్రకటించారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా మెహబూబా ముఫ్తి సచిన్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. ‘ స్కూల్ భనవ నిర్మాణానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఎంపీలాడ్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించినందుకు సచిన్‌కు ధన్యవాదములు ’ అంటూ మెహబూబా ముఫ్తి ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసి చాలా మంది సచిన్ మంచి మనసుకు జేజేలు పలుకుతూ కామెంట్లు చేస్తున్నారు.