పది లక్షల కృతజ్ఞతలు.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పది లక్షల కృతజ్ఞతలు.. కేటీఆర్

February 9, 2018

తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్‌లో పది లక్షలకు పైన ఫాలోవర్లు ఆయనను ఫాలో అవుతున్నారు. కొందరైతే ఆయనను స్మార్ట్ మంత్రి అని పిలుస్తుంటారు. సోషల్ మీడియాలో క్రేజున్న మంత్రి ఎవరంటే కేటీఆర్ అన్న స్థాయికి వెళ్ళారు. ఈ పదిలక్షల  మైలురాయిని అందుకున్న సందర్భంగా కేటీఆర్ కొద్ది సేపటి క్రితం ఓ ప్రత్యేక సందేశంలో   ట్విట్టర్‌లో కృతజ్ఞత లు తెలిపారు.నన్ను ఫాలో అవుతున్న పది లక్షల మందికి ప్రత్యేక నమస్కారాలన్నట్టు ఓ నమస్కార ఎమోజీని పోస్ట్ చేశారు. ‘ లెట్స్ స్టే కనెక్టెడ్.. అందరికీ పది లక్షల కృతజ్ఞతలు ’ అంటూ వ్యాఖ్యానించారు. మార్చి 2010లో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించి ఏడేళ్ళలో పది లక్షల ఫాలోవర్ల మైలురాయిని చేరటం సోషల్ మీడియాలో ఆయన చురుకుదనానికి తార్కాణం అని చెప్పొచ్చు.