‘పెళ్లి చూపులు’ అంటూ అందరి చూపులు తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మొత్తం కొత్తవారిని తీసుకుని ఓ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమాకు‘ ఈ నగరానికి ఏమైంది’ అని పేరు పెట్టారు. విహారయాత్ర నేపథ్యంలో ఈసినిమా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి పెళ్లి చూపుల లాగే ఈసినిమాను కూడా నేచురల్ క్యారెక్టర్స్‌తో తీర్చిదిద్ది మళ్లీ అందరి మెప్పును పొందుతాడేమో చూడాలె. ‘పెళ్లి చూపులు’ సినిమాకు తరుణ్ భాస్కర్‌కు జాతీయ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.