అభిమానికి సెహ్వాగ్ పాదాభివందనం - MicTv.in - Telugu News
mictv telugu

అభిమానికి సెహ్వాగ్ పాదాభివందనం

April 18, 2018

సెలబ్రిటీలు అభిమానుల పట్ల దురుసుగా వ్యవహరించడం చూస్తున్నాం… మంచిగా ప్రవర్తిస్తున్నవారినీ చూస్తున్నాం. రెండవ కోవలోకి వస్తాడు ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. తనను కలవటానికి ఎంతో అభిమానంతో వచ్చిన ఓ పెద్దమనిషిని సెహ్వాగ్ మనసారా గుండెకు హత్తుకుని, పాదాభివందనం చేశాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా వున్నాడు సెహ్వాగ్‌. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం జట్టు సభ్యులు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటే వారిని పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్నాడు. ఇంతలో ఓం ప్రకాశ్ అనే 93 ఏళ్ళ వృద్ధుడు సెహ్వాగ్ దగ్గరికి వచ్చాడు. సెహ్వాగ్ ఆ పెద్దాయన అభిమానానికి పొంగిపోయాడు. తనకోసం పాటియాలా నుంచి సుమరు 70 కిలోమీటర్ల దూరం వచ్చాడని ఓంప్రకాశ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఓ సెల్ఫీ దిగాడు. అంతటితో ఆగకుండా ఆ అభిమాని వయసును గౌరవిస్తూ ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్వాహకులు ట్విటర్‌‌లో షేర్ చేశారు.

Image result for telugu news, The 93 year old is the heart of his fan.. sehwag

ఈ ఫోటోలను సెహ్వాగ్ కూడా తన ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ నాకోసం పాటియాలా నుంచి వచ్చిన ఈ పెద్దాయనకు వందనం. దాదాకో ప్రణామ్. ఆయన ప్రేమకు నా జన్మ ధన్యమైంది ’ అని పేర్కొన్నాడు సెహ్వాగ్. అభిమానులు కలిస్తే చెంపదెబ్బుల కొట్టడం, అసహ్యించుకుంటూ దూరంగా వెళ్ళే సెలెబ్రిటీలకు సెహ్వాగ్ ఆదర్శప్రాయుడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.