ఇవాంకా పర్యటనపై వైట్‌హౌస్‌లో చిచ్చు! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా పర్యటనపై వైట్‌హౌస్‌లో చిచ్చు!

November 25, 2017

మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా  ట్రంప్ రానుంది. అయితే ఆమె పర్యటనపై ట్రంప్ సర్కారులోని ఒక మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

పాలనలో ఇవాంకా జోక్యం పెరిగిపోతోందని విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్  భావిస్తున్నారు. తనకు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆయన ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాంకా వెంట హైదరాబాద్‌లో పర్యటించాల్సిన  ఉన్నతాధికారులను సంఖ్యను ఆయన దాదాపు సున్నా చేసి, కేవలం ఒకే ఒక అధికారిని మాత్రమే పంపుతున్నారు. శ్వేతభవన వర్గాలు ఈమేరకు బాహాటంగానే చెబుతున్నాయి.

వైట్‌హౌస్, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇవాంకా, ఆమె భర్త జారుడ్ కుష్నర్‌ల ఆధిపత్యం పెరిగిపోతోందని టిల్లర్సన్ చెబుతున్నారు. ఇలాగైతే తాను పనిచేయడం కష్టమని ఆయన ఆంతరంగికులతో వాపోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన శాఖపై ఎలాగైనా పట్టు నిలుపుకోవాలనే ఆయన ఇవాంకా ట్రూపుకు కత్తెర వేశారని తెలుస్తోంది. అయితే ఇవాంకా భద్రతాధికారులు  మాత్రం పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నారు.