mictv telugu

ధర్మపోరాట దీక్షలో బాబు

February 11, 2019

ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షను ప్రారంభించారు. విభజన హామీల అమలులో తత్సారం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని, తమ హక్కుల కోసమే ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి, ఏపీ భవన్ లోని అంబేద్కర్, ఎన్టీఆర్ లకు నివాళులు అర్పించారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. నల్ల చొక్కా వేసుకుని దీక్షలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాకేం భిక్ష వేయడంలేదని, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని భంగపరిస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా ప్రధాని నెరవేర్చలేదని అన్నారు.

Telugu news The AP Chief Minister Chandrababu Dharmaporata initiated the Delhi ven.

రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది టీడీపీ శ్రేణులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు.Telugu news The AP Chief Minister Chandrababu Dharmaporata initiated the Delhi venue..