శ్రీరెడ్డిపై బ్యాన్ ఎత్తేసింది.. దిగివచ్చిన మా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డిపై బ్యాన్ ఎత్తేసింది.. దిగివచ్చిన మా

April 13, 2018

నటి శ్రీరెడ్డిని తొలుత చాలా మంది చిన్న చూపు చూశారు. కానీ నేడు ఆమె చూపిన తెగువ వల్ల టాలీవుడ్‌లో దశాబ్దాల తరబడి వేన్నూళ్ళుకుపోయిన కాస్టింగ్ కౌచ్ భూతానికి చింత బరిగెలతో బడిత పాశం జరుగుతోంది. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. కానీ బయటినుంచి అనూహ్యంగా ఆమెకు సపోర్టుగా నిలవటం గమనార్హం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం శ్రీరెడ్డికి సెల్యూట్ అన్నారు. ఆమె డేర్‌నెస్‌కి ఫిదా అయ్యారు. శ్రీరెడ్డి ఫిలింఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిందని ఆమెకు మాలో సభ్యత్వం ఇవ్వమని, మాలో వున్న 900 మంది ఆర్టిస్టులతో నటించకూడదని చెప్పింది.దీంతో పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ఓయూ జేఎసీ నుంచి శ్రీరెడ్డికి మద్దతు లభించింది. నిస్సహాయ పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ఇంతకన్నా ఏం చెయ్యగలదని ప్రశ్నించాయి. ఒక ఆడపిల్ల బట్టలు విప్పుకొని వచ్చిందంటే మా సిగ్గుపడాలని నేషనల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. రోజురోజుకూ ఈ విషయమై పలు దూమారాలు చెలరేగుతున్నాయి. చాలా మంది అమ్మాయిలు సైతం ధైర్యంగా బయటకు వచ్చి మేక వన్నె పులల భాగోతాలు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బెట్టు తగ్గించుకుంది. మెట్టు దిగింది. శ్రీరెడ్డిని మా ఫ్యామిలీ మెంబర్‌గా భావిస్తున్నామని చెప్పారు. మీడియా సమావేశంలో మా అధ్యక్షులు శివాజీరాజా మాట్లాడుతూ.. ‘ శ్రీరెడ్డి మీద మా పెట్టిన బ్యాన్‌ను ఎత్తి వేస్తున్నాం. ఆమెకు మా నుంచి సభ్యత్వ కార్డును ఇస్తాం. ఆలస్యం చేయకుండా త్వరలోనే ఉమెన్ అసోసియేషన్ గురించి నిర్ణయం తీసుకుంటాం ’ అన్నారు. ఇదిలా వుండగా ఉమెన్ అసోసియేషన్‌లో కాస్టింగ్ కౌచ్‌ను వ్యతిరేకించిన మహిళలను మాత్రమే నియమించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. బయట మహిళలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అంటున్నారు.