ఏప్రిల్ 2న దళిత సంఘాల భారత్ బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏప్రిల్ 2న దళిత సంఘాల భారత్ బంద్

March 31, 2018

సుప్రీం నిర్ణయం ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రతిబందంకంగా మారుతుందనే నేపథ్యంలో దళిత సంఘాలు ఏప్రిల్ 2వ తేదీన భారత్ బందుకు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం, సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రం ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దళిత సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్టు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది. అపాయింటింగ్ అథారిటి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా  అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరం కేసులు నమోదు చేస్తే, దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.