రవికల్లో రారాణి - MicTv.in - Telugu News
mictv telugu

రవికల్లో రారాణి

November 20, 2017

రవికా? ఏదైనా పరదా గుడ్డా? అని డౌటొస్తోంది కదా…  వంద అడుగుల ఎత్తున్న మహిళ కోసం కుట్టినట్టున్నది ఈ బ్లౌజు.. కానీ ఇది ఎవరి కోసమూ కుట్టింది కాదు. గిన్నిస్ బుక్కులో రికార్డును నెలకొల్పటానికే  కుట్టారు.దీన్ని తయారు చేసింది బెంగళూరుకు చెందిన అనురాధ ఈశ్వర్. 30 అడుగుల ఎత్తు, 44 అడుగుల వెడల్పు కలిగిన ఈ బ్లౌజ్‌ గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నది. దీన్ని తయారు చెయ్యటానికి ఐదుగురు నిష్ణాతులైన టైలర్లు శ్రమించారు. 280 మీటర్ల కాటన్ వస్త్రంతో 72 గంటల్లో పూర్తి చేశారు. ఈ జాకెట్టు గిన్నిస్ బుక్కు రికార్డు మాత్రమే కాదు.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నది. అలాగే ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో, ది యూనివర్సల్ రికార్డ్ ఫోరమ్ వంటి అనేక రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నది. ఇంతటి రికార్డును సాధించిన అనూరాధ ఈశ్వర్ ‘ ఉద్యమి అండ్ వినయ్ ఫ్యాషన్స్ ’ కు  ప్రొప్రైటర్‌గా వ్యవహరిస్తోంది.