బీజేపీ మతతత్వాన్ని పెంచి పోషిస్తూ.. ప్రజలను పిరికివాళ్ళను చేస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ మతతత్వాన్ని పెంచి పోషిస్తూ.. ప్రజలను పిరికివాళ్ళను చేస్తోంది

March 24, 2018

నటుడు ప్రకాశ్‌రాజ్ మరోమారు బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతతత్వాన్ని పెంచి పోషిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ కన్నడలోని మంజేశ్వరలో ఉన్న శాంతి సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘ హిట్లర్‌లాంటి వారి ఆధిపత్యమే కూలిపోయింది… ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంత ? తప్పుడు హామీలతో దేశ ప్రజలను బీజేపీ మభ్యపెడుతోంది. ప్రజలను అమాయకులను చేసి మోసగిస్తోంది.

సర్వధిక్కార ధోరణి అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితం. ఎంతో కాలం కొనసాగదు. ప్రతీదానికీ ఎక్స్‌పైరీ వుంటుంది.. బీజేపీకి కూడా ఆరోజు వస్తుంది ’ అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తామని ఏమీ చెయ్యలేకపోయారని.. గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులు పనులు చేసినట్టే చేసి దాన్ని వదిలేశారని ఎద్దేవా చేశారు.