బిజేపీ నేత దుర్మార్గం - MicTv.in - Telugu News
mictv telugu

బిజేపీ నేత దుర్మార్గం

October 24, 2017

అధికారాలను, పార్టీలను అడ్డం పెట్టుకొని కొందరు విచ్చలవిడి తనానికి తెగబడుతున్నారు. ఉచ్చనీచాలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకుడొకరు బహిర్భూమికి వెళ్ళిన ఓ యువతి ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బెదిరించాడు. ఈ సంఘటన పెను సంచలనం సృష్టిస్తోంది.

గుణ జిల్లా కేంద్రానికి చెందిన ప్రదీప్‌ భట్‌ స్థానిక బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అతడు గతంలో ఒక మహిళను వేధించిన కేసులో నిందితుడిగా వున్నాడు. ఆ కేసులో ప్రధాన సాక్షిగా వున్న మహిళనే ప్రదీప్ ఫోటోలు తీసి వేధించసాగాడు. ఇలా చేస్తే ఆమె తనకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పదని భావించాడు.

ఆమె బహిర్భూమికి వెళ్ళే టైంలో దొంగచాటుగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకుదిగాడు.బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారుప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.  అతనిపై ఐపీసీ 354సీ, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.