పెళ్లి చేసుకోమంటోందని  రైల్లోంచి తోసి చంపాడు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి చేసుకోమంటోందని  రైల్లోంచి తోసి చంపాడు

March 22, 2018

ఇద్దరి నమ్మకాలతో ముడిపడేది ప్రేమ. కానీ నమ్మకం చోట నయవంచన, మోసం వుంటే అది ప్రేమ ఎలా అవుతుంది అనటానికి ఈ ఘటనే నిదర్శనం. వాడు  ప్రేమించాడు, మోహించాడు.. ఇంతటితో తన పని అయిపోయిందనుకున్నాడు. ఇక ప్రియురాలితో పనేంటని ఆమెను కదులుతున్న రైల్లోంచి తోసి చంపేశాడు. ఈ హృదయవిదారకమైన ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడ్డ ఆ నయవంచకుడు వైద్యుడు కూడా.మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నాడు సునీల్. అక్కడే నర్సుగా పని చేస్తున్న పూనమ్ (22)ను ప్రేమిస్తున్నట్టు నటించాడు. పూనమ్ ఆ ప్రేమ నిజమే అనుకుని తన సర్వస్వాన్ని అర్పించింది. తర్వాత పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. అతుడు సమాధానం దాటవేసేవాడు. పూనమ్ మరింత ఒత్తిడి చేస్తుండడంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు.  తన తమ్ముడు సంజయ్‌తో కలసి కుట్రపన్నాడు. గోవా ట్రిప్ అని పూనమ్‌ను నమ్మించిన మార్చి15న తమ వెంట తీసుకెళ్లారు. మార్గమధ్యంలోని బెళగావి జిల్లా అసోలి గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే సునీల్, సంజయ్‌తో కలసి పూనమ్‌ను రైలు నుంచి తోసేశాడు. వారం రోజుల తర్వాత పూనమ్ మృతదేహం నీటిపై తేలియాడటంతో ఖానాపుర పోలీసులు విచారణ జరిపి బుధవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.