mictv telugu

తూటా సాక్ష్యం.. 12 ఏళ్లకు చిక్కాడు..

February 12, 2019

కొన్ని నేరాలు నిరూపితమవడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే కొందరు నేరస్థుల అతి తెలివి వల్ల నేరం బయటపడటానికి చాలా సమయం పడుతుంది. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అనేది నిజమని ఈ ఘటన నిరూపిస్తోంది. ముబయిలోని భివండీ పట్టణంలో పోలీసు ఠాణా నిర్మాణానికి సంబంధించి 12 ఏళ్లనాటి అల్లర్ల కేసులో నిందితుడు ఇప్పటికి చిక్కాడు. చట్టం కళ్ళుగప్పి తిరుగుతున్న అతణ్ణి ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు మొహినుద్దీన్‌ గులామ్‌ హుసేన్‌ మెమిన్‌.

2006 జులై 5న భివండీలోని కోటరాగేట్‌ వద్ద ప్రభుత్వ స్థలంలో కొత్తగా పోలీసు ఠాణా భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులపై ఓ గుంపు రాళ్లవర్షం కురిపించింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అయినా వారి రాళ్లదాడి ఆగలేదు. దీంతో వారు కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల కారణంగానే ఠాణా నిర్మాణం సగంలో ఆగిపోయింది.

https://mictv.in/wp-content/uploads/2019/02/Telugu-news-The-bulletproof-..-12-years-old-is-found-..jpg

ఈ కాల్పుల్లో ఒక తూటా మొహినుద్దీన్‌ ఎడమ కాలుకు తగిలింది. అతను వైద్యుడి దగ్గరికెళ్లి తూటాను తీయించుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతణ్ని ప్రశ్నించారు. రాయి తగిలి గాయమైందని అతడు నమ్మబలికాడు. దీంతో పోలీసులకు నిందితులు ఎవరనేది మిస్టరీగా మారింది. వాళ్లను ఎలాగైనా పట్టుకోవాలని తమ విచారణను అన్నీ కోణాల్లో జరుపుతున్నారు. అలా 12 ఏళ్లు చల్లగా గడిచిపోయాయి. పోలీసులకు ఎందుకో అతని గాయం మీద అనుమానం బలపడింది. ఆ గాయాన్ని పరిశీలించేందుకు అతడిని ముంబయి జె.జె.ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షల నివేదికలో- తూటా తగలడంతోనే గాయమైనట్లు తేలింది. దీంతో వెంటనే అతణ్ణి  అదుపులోకి తీసుకున్న క్రైం బ్రాంచ్‌, నిజాంపూర్‌ పోలీసులకు అప్పగించింది. నిందితుడిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచడంతో, 5 రోజుల కస్టడీకి ఆదేశించారు. Telugu news The bulletproof .. 12 years old is found