ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 23 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 23 మంది మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం లోరన్ నుంచి పూంచ్ వెళ్తున్న బస్సు (జేకే02డబ్ల్యూ0445)..  పూంచ్ జిల్లాలోని మండి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మండి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.Telugu News The bus that fell into the valley has killed 23 people