హార్దిక్‌ పాండ్యాపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

హార్దిక్‌ పాండ్యాపై కేసు

March 22, 2018

అంబేద్కర్‌పై రెచ్చగొట్టే విధంగా ట్విటర్‌లో కామెంట్ పోస్ట్ చేసినందుకుగాను క్రికెటర్ హార్దిక్ పటేల్ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ‘ ఏ అంబేద్కర్ ? తప్పుల చట్టాలు, రాజ్యాంగాన్ని రచించిన ఆ అంబేద్కరా..? లేదంటే దేశంలో రిజర్వేషన్లు అనే జబ్బును వ్యాప్తి చేసిన ఆ అంబేద్కరా ? ’ అంటూ డిసెంబరు 26న ట్విటర్‌లో హార్దిక్ పోస్ట్ పెట్టాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు పాండ్యా. రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ భీమ్‌సేన సభ్యుడిగా చెప్పుకొంటున్న డీఆర్ మేఘ్వాల్ పాండ్యా ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు.‘ పాండ్యా చేసిన కామెంట్ గురించి సోషల్ మీడియా ద్వారా నాకు జనవరిలో తెలిసింది. అది రెచ్చగొట్టే ధరోణితో ఉంది. అంబేద్కర్‌ను అవమానిస్తూ పోస్ట్ పెట్టాడు. అది ఆయన్ను మాత్రమే అవమానించినట్టు కాదు.. మొత్తం ఎస్సీ వర్గాన్ని అవమానించినట్టే. అంబేద్కర్ లాంటి వ్యక్తి మీద అలాంటి వ్యాఖ్యలు చేసి సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసి విడగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేశాడు ’ అని అసహనం వ్యక్తం చేశారు మేఘ్వాల్. అంబేద్కర్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రమైన నేరం చేశాడని, అతనికి కఠిన శిక్ష విధించాలని మేఘ్వాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.