నామాపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

నామాపై కేసు

October 28, 2017

టీడీపీ ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర్రావుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఓ మహిళ నగ్న దృశ్యాలను పట్టుకొని బెదిరింపులకు తెగబడ్డాడనే ఆరోపణలతో సదరు మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కోర్టు ఆదేశాలతో నామాపైనే కాకుండా ఆయన తమ్ముడు నామా సీతయ్యపై కూడా ఐపిసి 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాదుకు చెందిన తన నగ్న ఫోటోలు, వీడియోలు తీసి, వాటిని నేను చెప్పకుండా వినకపోతే బయట పెడతానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.