ఇండస్ట్రీలో కులమతాల పట్టింపులు చాలా ఎక్కువ.. ప్రతాని - MicTv.in - Telugu News
mictv telugu

ఇండస్ట్రీలో కులమతాల పట్టింపులు చాలా ఎక్కువ.. ప్రతాని

April 23, 2018

కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీశక్తి లేవనెత్తిన దూమారం అంతా ఇంతా కాదు. ఆ సమస్యతో పాటు ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో క్యాస్ట్ అనే మహమ్మారి కూడా పట్టి పీడిస్తోందని ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.     ‘ సహచరుడు ’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక కులం వారే కమిటీలు నిర్వహించడం సరికాదు. సినిమాల్లో అందరం ఒక్కటే అనే నీతులు చెప్తారు కానీ తెర వెనుక కులమతాల పట్టింపులు చాలా వున్నాయి.

ఇండస్ట్రీ అంటే అందరిదీ. అందరికీ సమాన హక్కులు కల్పించాలి. కళాకారులు అందరూ సమానమని భావిస్తున్నామని పైకి అంటారు గానీ పాటించరు. ఇదెక్కడి న్యాయం ? టాలెంట్‌ను బట్టి ప్రోత్సహించే మాట పూర్తిగా అవాస్తవం అవుతోంది. కులాల వారీగా ఎన్నుకుంటున్నారు. ఈ పాడు ధోరణి కొందరు పెద్దలు గ్రహించాలి. ఇండస్ట్రీ మారాలి. అప్పుడే ఇండస్ట్రీ మీద గౌరవం పెరుగుతుంది. మారని పక్షంలో ఈ విధానంపై నేను పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ’ అని పేర్కొన్నారు. సహచరుడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నానని అన్నారు.