పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లకు కేంద్రం ప్రశంస   - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లకు కేంద్రం ప్రశంస  

October 31, 2017

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతున్నదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల నిర్మాణంపై కేంద్రం ప్రశంసించిందని తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం 451 టాయిలెట్స్ వాడకంలో ఉన్నాయన్నారు.