ఆదర్శ యువకుడు… ఇంటికొచ్చి అభినందించిన సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

ఆదర్శ యువకుడు… ఇంటికొచ్చి అభినందించిన సీఎం

November 24, 2017

కానికట్నం తీసుకోకపోవడమే కాకుండా మతాంతతర వివాహం కూడా చేసుకొని ఆదర్శంగా నిలిచిన సంజిత్ కుమార్‌ను బిహార్ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలతో ముంచెత్తారు. స్వయంగా అతని ఇంటికి వెళ్ళి మరీ ముఖ్యమంత్రి అంతటి వాడు అభినందించారు.బిహార్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు గతంలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పాట్నాకు చెందిన సంజిత్ కుమార్, జూహి అనే యువతి కట్నం లేకుండా ఈ నెల 19న మతాంతర వివాహం చేసుకున్నారని సీఎం దృష్టికి వచ్చింది. వెంటనే సంజిత్ ఇంటికి వెళ్లి ఇద్దరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలపారు. వీరిని యువత ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలో వరకట్న పిశాచిని తరిమి తరిమి కొట్టొచ్చని అభిప్రాయపడ్డారు.