ఈ జంటకు నెటిజనులు పెట్టిన పేరు ‘ విరుష్కా ’ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ జంటకు నెటిజనులు పెట్టిన పేరు ‘ విరుష్కా ’

September 13, 2017

అందమైన జంటగా ప్రఖ్యాతి గాంచిన విరాట్ కోహ్లీ – అనుష్కా శర్మల ఈ తాజా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వీరి ముచ్చటైన జంటను చూసి ఇద్దరి ఫ్యాన్స్, నెటిజనులు ‘ విరుష్క ’ ( #virushka ) అని నామకరణం చేశారు.

https://twitter.com/xfangirlx___/status/907661317669928960

ఇంతకూ వీరిద్దరు కలిసి ఎక్కడ చక్కర్లు కొట్టారో తెలుసా.. శ్రీలంకలో. టీమిండియా శ్రీలంక పర్యటనలలో వుంది. అక్కడికెళ్ళిన అనుష్కా శర్మతో విరాట్ చాలా సమయాన్ని కేటాయించాడట. తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా వారిద్దరు దిగిన మిగతా ఫోటోలను కూడా షేర్ చేస్కున్నాడు. అలాగే వాటికి స్టేటస్ కూడా పెట్టాడు. ‘ నా ప్రేమకు తోడుగా ముఖ్యమైన విరామం తీస్కుంటూ ’ అని పెట్టాడు.

సోషల్ మీడియా ఆక్టివిస్టులు వూరుకుంటారా.. ఆ ఫోటోలను షేర్ల మీద షేర్లు చేస్తూ వైరల్ గా మార్చేసారు. వీరిద్దరి జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుందని తెలిసిన ముచ్చటే.

https://twitter.com/PreetamVK18/status/906837030981611522