దళితులు గుడిలోకి.. ‘దేవత’కు కోపమొచ్చింది..! - MicTv.in - Telugu News
mictv telugu

దళితులు గుడిలోకి.. ‘దేవత’కు కోపమొచ్చింది..!

March 13, 2018

ఊళ్ళల్లో ఇంకా మూర్ఖత్వం వేన్నూళుకొని వుందని చెప్పటానికి ఈ ఘటన తాజా ఉదాహరణ. దళితులు మనుషులే కారు అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళు గుడిలోకి ప్రవేశించారని అగ్రకులానికి చెందిన ఓ మహిళ తనమీద అమ్మవారు పూనిందని నానా అల్లరి చేసింది.అత్యంత సిగ్గుచేటుతనానికి గురిచేస్తున్న ఈ ఘటన సోమవారం కర్ణాటకలోని కుణిగల్‌ తాలూకాలో చోటు చేసుకుంది. తాలుకాలోని కెంకరమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎక్కడెక్కడినుండో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవటానికి అక్కడికి వస్తారు. ఆ క్రమంలో దళిత కుటుంబాలకు చెందిన కొందరు గుడిలోకి వెళ్లి కెంకమ్మదేవిని దర్శించుకున్నారు. అదే వారు చేసిన మహాపాపం అయినట్టు అక్కడున్నవారంతా వారి మీద మూకుమ్ముడిగా విరుచుకుపడ్డారు.. మీకు గుడిలోకి వెళ్ళే అర్హత లేదని వాగ్వాదానికి దిగారు.. నానా మాటలతో వారిని అవమానానికి గురి చేశారు.

అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న అగ్రకులానికి చెందిన ఓ మహిళ త్రిశూలాన్ని చేతపట్టుకొని తనకు అమ్మవారు పూనినట్లు వీరంగం సృష్టించింది. తన అభీష్టానికి వ్యతిరేకంగా దేవాలయంలోకి ప్రవేశించి అంతా అపవిత్రం చేశారని అందుకు స్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో దళితులు తమను వాళ్ళు అవమానించారని, తమకు న్యాయం చేయాలని గుడి ముందు నిరసన చేపట్టారు.