అమెరికాలో అదృశ్యమైన కుటుంబం.. నదిలో శవాలయ్యారు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో అదృశ్యమైన కుటుంబం.. నదిలో శవాలయ్యారు

April 17, 2018

అమెరికాలో ఏప్రిల్ 8 నుంచి అదృశ్యమైన భారతీయ కుటుంబం నదిలో విగత జీవులుగా లభ్యమయ్యారు. అత్యంత విషాదకర ఈ ఘటన కాలిఫోర్నియాలోని ఈల్ నదిలో చోటు చేసుకుంది. విహార యాత్రకు అని వెళ్ళిన సందీప్ తోటపల్లి కుటుంబం మొత్తం నదిలో మునిగి చనిపోవటం చాలా మందని అత్యంత బాధకు గురి చేస్తోంది.అమెరికాలో స్థిరపడిన తోటపల్లి సందీప్ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకపోవటం అత్యంత విషాదం.

కాలిఫోర్నియాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటాక్లారిటా వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు సందీప్ తోటపల్లి. గుజరాత్‌కు చెందిన సందీప్ తోటపల్లికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఈయన గత కొద్దిరోజుల క్రితం పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్‌జోస్‌కు ఆయన భార్య సౌమ్య, వారి పిల్లలు సిద్ధాంత్, సాచీలు తమ ఎస్‌యూవీలో విహార యాత్రకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. వారికోసం పోలీసులు విస్తృతంగా గాలించారు.చివరకు  పడిపోయిన ఎస్‌యూవీలో రెండు మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. సందీప్ తోటపల్లి(41), ఆయన కుమార్తె సాచి తోటపల్లి(9) మృతదేహాలను గుర్తించారు పోలీసులు. గత శుక్రవారం ఇదే నదిలో 38ఏళ్ల సౌమ్య తోటపల్లి మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు. వారి కుమారుడు సిద్ధాంత్ తోటపల్లి(12) ఆచూకీ ఇంకా దొరకలేదని తెలపారు. అతడి మృతదేహం కోసం నదిలో 20మంది సభ్యుల బృందం గాలిస్తోందని తెలిపారు. కొడుకు మరణవార్త తెలిసి గుజరాత్‌లో సందీప్ తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరివల్లా కావటం లేదు. పదిహేనేళ్ళ క్రితం అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డ కొడుకు కుటుంబం ఇలా అర్థాంతరంగా చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సౌమ్య స్వస్థలం కేరళలోని కొచ్చి. ఆమె ఇంట కూడా విషాధ ఛాయలు అలుముకున్నాయి.