తొలి ఎలక్ట్రిక్ సూపర్  బైక్.. గంటకు 200 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

తొలి ఎలక్ట్రిక్ సూపర్  బైక్.. గంటకు 200 కి.మీ.

February 8, 2018

గంటకు 200 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే బైక్ అంటే యూత్‌లో బీభత్సమైన క్రేజే. ఆ క్రేజీ కోరిక ఈ ఏడాది జులై నుండి తీరనున్నుది. భారత వాహన ప్రదర్శన ( ఆటో ఎక్స్‌పో 2018 ) ప్రీ ఓపెన్‌ ఈవెంట్‌ బుధవారం గర్గావ్‌లో అట్టహాసంగా  ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. ఇందులో పైన తెలిపిన గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే, బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఎమ్‌ఫ్లక్స్‌ మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ సూపర్‌బైక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మారుతి సుజుకీ, టాటామోటార్స్‌, హ్యుందాయ్‌, మహీంద్రా లాంటి దేశీయ కంపెనీలతో పాటు, టయోటా,కియా మోటార్స్‌, కవాసకీ, బెంజ్‌లాంటి విదేశీ సంస్థలు కొత్త కొత్త మోడళ్ళను ప్రదర్శనకు పెట్టారు. వాటిని వెనక్కు నెట్టిన ఈ బైక్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బైక్‌గా క్రేజ్ సంపాదించుకుంది. ఎమ్‌ఫ్లక్స్‌ వన్‌ పేరుతో ఈ బైక్‌ను రూపొందింది. అనుకున్న వ్యవధిలోనే ఈ బైక్‌ను విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.

2019 ఏప్రిల్‌ నుంచి తొలి డెలివరీని మొదలు పెట్టనున్నారు. దీని ధర రూ.5.5లక్షల నుంచి రూ. 6లక్షల వరకూ ఉండదనుందట. కేవలం ఆన్‌లైన్‌లోనే ఈ బైక్‌లను విక్రయిస్తారట. పేమెంట్‌ను కూడా డిజిటల్‌గానే స్వీకరిస్తుందట. ఈ ప్రీ ఓపెన్‌లో మీడియా, వాణిజ్య ప్రముఖులను మాత్రమే ప్రదర్శనకు అనుమతిస్తారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో మొదలవుతుంది. ఈ నెల 14 వరకు మాత్రమే ప్రజల సందర్శనకు అనుమతిస్తారు.