2036లో యుగాంతం.. - MicTv.in - Telugu News
mictv telugu

2036లో యుగాంతం..

November 20, 2017

2036లో ఓ ఉల్క ఢీకొని భూమి అంతమవనున్నది.. ఈ మాటన్నది ఉబుసుపోని ఆధ్యాత్మిక గురువులు కాదు.. నాసానే అంటోంది. భూమి అంతం అనే మాట ఈ మధ్య బాగా వినిపిస్తున్నది.  వీరబ్రహ్మం వంటివారు.. నిబిరు అనే ఓ గ్రహం భూమి వైపు దూసుకు వస్తున్నదని, రేపో మాపో భూమి అంతం తప్పదని అంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై నాసా కూడా భూమి అంతాన్ని ఊహిస్తున్నది. అపోఫిస్ అనే ఉల్క.. భూమిని బలంగా ఢీకొనడంతో మానవాళి అంతమయ్యే ప్రమాదం ఉన్నట్లు నాసా తన వెబ్‌సైట్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 2004లో నాసా ఈ ఉల్కను కనుగొన్నది. 13 ఏళ్లుగా దీని కదలికలను పరిశీలిస్తూనే ఉన్నది. దాని కదలికలను గమనించిన తర్వాత 2036 ఏప్రిల్ 13న  అది భూమిని ఢీకొనడం ఖాయమని నాసా ఓ అంచనాకు వచ్చినట్టు ఐబీ టైమ్స్ అనే పత్రికలో ఈ కథనం వచ్చింది. నాసా అధికారి డునె బ్రౌన్ కూడా ఈ విషయాన్ని ధ్రవీకరించారు. భూమికి కేవలం 32 వేల కిలోమీటర్ల దూరం నుంచి అది వెళ్తుందని రష్యా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ఆ సమయంలో దాని దారిలో ఏకొద్ది తేడా వచ్చినా అది భూమిని ఢీకొట్టడం జరుగుతుందంటున్నారు.  నాసా ప్రొపల్షన్ లేబొరేటరీలోని సైంటిస్టులు స్టీవ్ చెల్సీ, పాల్ ఖొడాస్ 2009 నుంచి ఈ ఉల్క గమనాన్ని  పరిశీలిస్తున్నారు. అపోఫిస్ అనే ఈ ఉల్క చాలా ఆందోళన కలిగిస్తున్నదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యుటేషనల్ టెక్నిక్స్, డేటాను విశ్లేసిస్తే అది భూమిని ఢీకొట్టడం ఖాయమంటున్నారు. అంతకు ముందు 2029 లో కూడా అపోఫిస్ ఒకసారి భూమికి దగ్గరగా రానున్నదని తెలిపారు.