దళితుణ్ణి ప్రేమించిందని కూతురిని చంపిన తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

దళితుణ్ణి ప్రేమించిందని కూతురిని చంపిన తండ్రి

March 23, 2018

హైటెక్ టెక్నాలజీతో ప్రపంచం పరుగులు పెడుతున్నా.. కులాల కుమ్ములాటలు ఆగేలా లేవు. మతాల వైషమ్యాలు తొలిగేలా లేవు ? పరువు ప్రతిష్ఠల కన్నా ఏదీ ముఖ్యం కాదనుకుంటున్న కుంటు సమాజానికి మానవత్వపు అంటు కట్టేది ఎవరు ? కన్నకూతురు దళిత వ్యక్తిని ప్రేమించిందంటూ కన్నతండ్రే అత్యంత దయనీయంగా కూతురును కత్తితో పొడిచి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కేరళ మలప్పురంలోని అరిక్కోడ్‌లో గురువారం చోటు చేసుకుంది. ఉన్నత వర్గానికి చెందిన రాజన్(42) కూతురు అథిర (22) దళిత యువకుణ్ణి ప్రేమించింది. అతను ఆర్మీలో ఉద్యోగం చేస్తాడు.కూతురు కులం తక్కువ వాణ్ణి ప్రేమించిందని ఆ తండ్రి కూతురి ప్రేమను అంగీకరించలేకపోయాడు. అతణ్ణి మరిచిపోవాలన్నాడు. కానీ అథిర చచ్చినా అతణ్ణి మరిచిపోనని, అతణ్ణే పెళ్ళి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అంతే ఆవేశానికి లోనైన తండ్రి అథిరను కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.