యస్.. నాకు మైండ్ దొబ్బింది... - MicTv.in - Telugu News
mictv telugu

యస్.. నాకు మైండ్ దొబ్బింది…

November 20, 2017

నాగ్ – వర్మల కాంబినేషన్‌లో సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ‘ నేను నాగార్జునను నమ్ముతాను కానీ దేవుణ్ణి నమ్మను. వర్మకు మైండ్  దొబ్బింది.. సత్తా లేదు అని అంటున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక వర్మకు బుర్ర లేకపోయినా సత్తా వుందని చెప్తారు’ అని వర్మ అన్నారు.

28 సంవత్సరాల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొని వున్నాయి. నాగార్జున కూాడా హర్షం  వ్యక్తం చేస్తూ ‘ శివ సినిమా సమయంలో వర్మ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా నాకు అంతే స్వేచ్ఛ  ఇస్తున్నాడు. ఈ కథ విని నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. కొన్ని సీన్లు వర్మ చెప్తుంటే నాకు ఆశ్యర్యం కలిగింది. ఇది తప్పకుండా శివ రికార్డులను బద్దలు కొడుతుంది ’ అన్నారు.

శివ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ ప్రారంభం రోజు అన్నపూర్ణా స్టూడియోలో చైన్‌లతో కూడిన స్టేజీని రూపొందించారు. ‘ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా, తక్కవ నొప్పితో చస్తావ్.. చూజ్.. ’ అంటూ తొలిషాట్ డైలాగ్ చెప్పారు నాగ్.

ఈనెల పది రోజుల షూటింగ్ జరిపి అనంతరం డిసెంబర్ 22న అఖిల్ సినిమా విడుదలయ్యాక రెగ్యలర్ షూటింగ్ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.