200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌ ! - MicTv.in - Telugu News
mictv telugu

200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌ !

February 7, 2018

భారత మహిళా క్రికెట్‌లో జులాన్ గోస్వామి సంచలన రికార్డ్ నమోదు చేసింది. మహిళల అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా గోస్వామి ప్రపంచ రికార్డ్ సాధించింది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గోస్వామి ఈ రికార్డును సొంతం చేసుకుంది. తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టిన గోస్వామి మడమ తిప్పలేదు. 

ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో ఐదో ఓవర్‌ చివరి బంతికి దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లారాను చిత్తు చేసి ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఈ సీనియర్ మహిళా క్రికెటర్ 10 టెస్ట్ మ్యాచుల్లో 40 వికెట్లు, 60 టీ 20 మ్యాచుల్లో 50 వికెట్లు పడగొట్టిన అరుదైన రికార్డ్ ఆమె సొంతం. 2011లో 166 వన్డేలాడిన గోస్వామి 3.23 ఎకానమీతో 200 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌పై ఆమె అద్భుత బౌలింగ్‌ (6/31 )గా నమోదు చేసిన ఘనత ఆమె సొంతం.