కరీనా స్టెప్పులు సూపర్... - MicTv.in - Telugu News
mictv telugu

కరీనా స్టెప్పులు సూపర్…

October 26, 2017

బాబు పుట్టాక కరీనా కపూర్ నటించిన కొత్త సినిమా ‘ వీరె ది వెడ్డింగ్ ’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను మూవీ యూనిట్ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రిలీజ్ చేసింది.

చాలా ఆకర్షణీయంగా, రిచ్ లుక్‌లో వున్న ఈ పోస్టర్‌పై కరీనా కపూర్‌తో పాటు సోనమ్ కపూర్, స్వరాభాస్కర్, శిఖ తల్సానియా షేర్వానీ డ్రస్సులు వేసుకుని, తలపాగా చుట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ తీన్మార్ స్టెప్పులేస్తున్న స్టిల్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. చాలా మంది ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అక్క సినిమాకు చెల్లెలు నిర్మాత అవడం ఈ సినిమా మీద ఆసక్తిని రేకెత్తిస్తోంది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 18, 2018 న మూవీ విడుదలకు సర్వం సిద్ధమవుతోంది.