కరాటే గర్ల్ అని తెలియక కెలికి.. కుయ్యో, మొర్రో.. - MicTv.in - Telugu News
mictv telugu

కరాటే గర్ల్ అని తెలియక కెలికి.. కుయ్యో, మొర్రో..

April 7, 2018

అమ్మాయిలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే మగ తోడేళ్ళ ఆట కట్టించవచ్చు అని ఈ ఘటన రుజువు చేస్తోంది. హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాలో ఈ కరాటే రాణిని చాలా మంది అమ్మాయిలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం కరాటే క్లాసు ముగించుకొని షేర్ ఆటోలో ఇంటికి వెళుతోంది నేహా జాంగ్రా. ఇంతలో అదే ఆటోలో ఆమె పక్కనే కూర్చున్న ట్రాఫిక్ పోలీస్ తన ఒంటి మీద వున్న బాధ్యత గల యూనిఫాంను మరిచిపోయి తనలోని పోకిరీని నిద్రలేపాడు.నేహా అందాన్ని చూసి చొంగ కార్చుకుంటూ వెళ్లి కెలికాడు. నీ ఫోన్ నంబర్ కావాలని, నీతో స్నేహం చేయాలని వుందని బలవంతం చేశాడు. ఇవ్వనని చెప్పినా అతను వేధించడం ఎక్కువ చేయటంతో విసుగెత్తిపోయింది నేహా. ఆమె నేషనల్ లెవల్ కరాటే ప్లేయర్‌గా గోల్డ్ మెడల్ సాధించింది. ఇలాంటి పోకిరీల చేష్టల గురించి తెలుసు. అంతే. ఆమెలోని  కరాటే లేడీ జూలు విదిల్చింది. ఆటో డ్రైవర్ సాయంతో అతణ్ణి మహిళా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్ళి ఫిర్యాదు చేసింది. పోలీసుల ముందే అతని రెండు చెంపలు వాచేలా కొట్టింది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌‌ను ఇప్పటికే సస్పెండ్ చేశామనీ.. రాతపూర్వక ఫిర్యాదు అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రోహ్‌తక్ డీఎస్పీ రవీంద్ర పేర్కొన్నారు. అంతేకాక దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అన్నారు.  అయితే ట్రాఫిక్ పోలీసుపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా పోలీసుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది.