ఆడిషన్స్‌కు వచ్చే అమ్మాయిలను పడుకుంటావా అంటాడు.. ఛీఛీ వాకాడ - MicTv.in - Telugu News
mictv telugu

ఆడిషన్స్‌కు వచ్చే అమ్మాయిలను పడుకుంటావా అంటాడు.. ఛీఛీ వాకాడ

April 13, 2018

శ్రీరెడ్డి చేసిన డేర్‌తో ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు టాలీవుడ్ పరిశ్రమలో తమకు జరిగిన అన్యాయం గురించి ఒక్కొక్కరు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. శ్రీరెడ్డి ఇచ్చిన ఇన్సిపిరేషన్‌తో ఈరోజు మేమంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అంటున్నారు. ఈ క్రమంలో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓ మీడియా ఛానల్ లైవ్‌లో నిర్మాత వాకాడ అప్పారావు గురించి మాట్లాడారు. ఆడిషన్స్ కోసం వచ్చే అమ్మాయిలను పడుకుంటావా అని అడుగుతాడు ఈ వాకాడ అని చెప్పారు. హేమ అనే అమ్మాయిని రాత్రంతా లైంగికంగా వేధించాడని చెప్పారు. సదరు మహిళ కూడా ఫోన్‌లో వాకాడ అప్పారావు బండారం మొత్తం బయట పెట్టింది.తనకు లైంగిక పటుత్వం లేకపోతే ఉత్ర్పేరకాలు వాడుతూ అమ్మాయిలను వేధించేవాడని చెప్పారు. కానీ ఫోన్ లైన్‌లో వున్న వాకాడ అప్పారావు మాత్రం నేను ఏ తప్పు చేయలేదు. వీళ్ళంతా తన మీద అనవసరపు నిందలు మోపుతున్నారని అన్నారు. పైగా నాకు పదేళ్ళ క్రితం జరిగింది గుర్తు లేదని బుకాయించారు. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని అన్న ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా ఇన్ని సినిమాలు చేశానని చెప్పారు. కానీ ఫలానా అమ్మాయిని వాడుకున్నది మాత్రం గుర్తు లేదా అని యాంకర్ ప్రశ్నించేసరికి నీళ్ళు నమిలారు వాకాడ. ఆడిషన్స్ కోసం వచ్చే చాలా మంది అమ్మాయిలను లైంగికంగా వేధిస్తాడని వాళ్ళంతా చెప్పారు.

తల్లి బాగాలేదు.. నీ కూతురును పంపించు అని చెప్పాడని తెలిపారు. ఇన్ని రోజులు స్క్రీన్ మీద వాకాడ అప్పారావు అని పేరు చూసి చాలా మంది హుందాగల మనిషని అనుకున్నారు కానీ వాకాడ ఇంత నీచుడా.. ఛీఛీ.. అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ సైరా ’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు వాకాడ అప్పారావు. గతంలో సూపర్ గుడ్ సంస్థతో కలిసి సినిమాలు నిర్మించారు. ఇంత మంది అమ్మాయిలు నోరు తెరిచి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్తుంటే ఈ చిరంజీవులు, రామ్ చరణ్‌లు, పవన్ కల్యాణ్‌లు, హహేష్‌లు, నాగార్జునలు ఎందుకు స్పందించటం లేదు అని వారంతా నిలదీస్తున్నారు. హీరోలంటే తెరమీదేనా.. వాస్తవ జీవితాల్లో ఇంత మంది అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంటే ఏ హీరో నోరు తెరవక పోవటం సిగ్గుచేటు అంటున్నారు.