మీనీ ఆర్చరీలో తెలంగాణ జట్టుకు స్వర్ణం - MicTv.in - Telugu News
mictv telugu

మీనీ ఆర్చరీలో తెలంగాణ జట్టుకు స్వర్ణం

October 28, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో జరిగిన జాతీయ మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం లభించింది. అండర్ – 9 కంపౌండ్ టీంలో శారవ్ కుమార్, రిషికేష్, జయదేవ్, తనీష్‌లు వున్న తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టును 1623 – 1503 తేడాతో ఓడించింది. జయదేవ్ వ్యక్తిగత విభాగంలో ( 10 మీటర్లు – 15 మీటర్లు ) రెండు స్వర్ణాలు గెలవడం గమనార్హం. పతకాలు నెగ్గిన చిన్నారులను తెలంగాణ ఆర్చరీ సంఘం సెక్రటరీ ఇ. సంజీవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.