అమ్మమ్మ వాళ్లింటికని వెళ్లింది.. శవమై తేలింది - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మమ్మ వాళ్లింటికని వెళ్లింది.. శవమై తేలింది

April 16, 2018

హైదరబాద్‌లోని లింగంపల్లిలో బ్యటిషియన్‌గా పని చేస్తున్న జ్యోతి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్ళింది. కానీ మైలారం రైల్వే స్టేషన్‌లో శవమై తేలింది. ఇంతలోనే ఆమె చనిపోవటానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..  వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన జ్యోతి ధారూర్ అనే యువతి.. లింగంపల్లిలోని గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆదివారం తాండూరులోని అమ్మమ్మ వాళ్ళింటికి అని బయల్దేరింది జ్యోతి. ఏమైందో తెలియదు గానీ మైలారం రైల్వే స్టేషన్‌లో శవమై కనిపించింది. సోమవారం ఉదయం రైల్వే సిబ్బంది ఆమెను గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందివుంది. జ్యోతి  ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు సమాచారం.రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని జ్యోతిది హత్యానా?… ఆత్మహత్యానా?.. లేకపోతే రైలు నుంచి పడిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా జ్యోతి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను ఎవరరైనా అత్యాచారం చేసి చంపారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు లింగంపల్లి స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. యువతితో పాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు.