ది గ్రేట్ గంగవ్వ   - MicTv.in - Telugu News
mictv telugu

ది గ్రేట్ గంగవ్వ  

November 23, 2017

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు భాషీయుల ‘సుహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గు చేటు అని కాళోజి తెలంగాణ యాసను, భాషను  యీసడించుకునే వాళ్లమీద తన కలాన్ని వినిపించాడు. అయితే ఇపుడు అదే భాష, యాసను చాలామంది నెత్తినెక్కిచ్చుకుంటున్రు. తెలంగానోళ్ల మాట, యాస ఇకారం అనే ముచ్చట నుంచి ఇష్టపడే దాకా మారింది పరిస్థితి. తెలంగాణ రాష్ర్టం ఒచ్చినంక మన మాట ముచ్చట్లు  టీవీల నుంచి సిన్మలదాకా పాకినాయి. మన యాస, భాషల  వార్తలు జెప్పితే ఎంత గమ్మతి గుంటదో రాములమ్మ, మల్లన్న అటెన్క వచ్చిన  బిత్తిరి సత్తి  సూపెట్టిన్రు. తెలంగాణ భాషను జనబాహుల్యంలోకి గట్టిగా తీసుకుపోవడంలో మస్తు ఉపయోగపడిన్రు.ఇక గిప్పుడు అవ్వ కొడుకుల ముచ్చట మొదలయింది. ఈపారి మరింత సహజంగా ఉన్నది కత… లంబాడిపల్లె నుంచి ప్రతి రాత్రి బువ్వ సమయానికి తెలంగాణ యాస గుమగుమలు టీవీల నుంచి వచ్చి కడుపు నింపుతున్నయి. గంగవ్వ రాజుల లొల్లి రోజూ రాత్రి… టైపాస్ అయిడుతోపాటు, లేటేస్ట్ ముచ్చట్లను పరిచయం జేస్తున్నయి, ముఖ్యంగా గంగవ్వ భాష. 40 నాటి నుంచి టీవీలు, సిన్మాలల్ల ‘ఆంద్రాభాషా సామ్రాజ్యవాద’  ప్రభావానికి దూరంగా బతికున్న మన యాస స్వచ్చంగా ఉన్నది. రాజుగాడి మాటలు..  టీవీలు, ఫోన్ల దునియాలో కూడా  తెలంగాణ యాస ఉన్నదున్నట్లు మాట్లాడే పొరగాళ్ల భాషలా కనెక్ట్ అయితుంది. తెలంగాణ యాస ఇప్పుడు ఒక వోగ్…నయా ఫ్యాషన్… ఇంటర్నెట్లో ఈ మద్య ప్రతి తెలంగాణ యాస ఉన్న పాట, స్కిట్ మిలియన్ వ్యూస్ దాటుతున్నాయి. అందుకే అందరు మన తొవ్వ పట్టిన్రు.  గంగవ్వ రూపంలో మరోసారి తెలంగాణ భాషాభిమానులకు ఇప్పుడు ఒక స్పూర్తి ఇస్తుంది.