వరుడికి బట్టతల ఉందని పెళ్లిపీటలపై నుంచి లేచి.. - MicTv.in - Telugu News
mictv telugu

వరుడికి బట్టతల ఉందని పెళ్లిపీటలపై నుంచి లేచి..

February 23, 2018

‘ నేను చేసుకుంటే గీసుకుంటే మహేష్ బాబు లాంటోణ్ణే చేసుకుంటాను ’  అనుకునే అమ్మాయిలు.. ‘ నేను చేసుకోబోయే అమ్మాయి తమన్నాలా వుండాలి ’ అనుకునే అబ్బాయిలు చాలా మంది కట్టగట్టుకున్నట్టే తయారయ్యారు. కానీ తమకు భౌతికంగా వున్న అర్హతలేంటో ఆలోచించరు. తను అనుకున్నట్టు లేడనుకున్న అబ్బాయిని పెళ్ళి పీటల మీద రిజెక్ట్ చేసిందో అమ్మాయి. పెళ్ళి కొడుక్కి బట్టతల వుందని పెళ్ళి పీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి కుమార్ పెళ్ళి ఫిక్సయ్యిందని సంబర పడ్డాడు. తన కలల సుందరి తన జీవితంలోకి అడుగుపెడుతోందని ఆనందపడ్డాడు.ఇంకాసేపట్లో వధువు మెడలో మూడుముళ్ళు వేయటానికి సిద్ధమయ్యాడు. పెళ్లి మండపంలో అతని తల మీదున్న టోపీ తీయగానే వధువు షాకైంది. ‘ ఈ బట్టతలతనితో నాకీ పెళ్లి వద్దు. నాకు జుట్టు ఒత్తుగా వున్న మగాడే మొగుడుగా రావాలి ’ అని లేచి పెళ్ళి మండపంలోంచి వెళ్లిపోయింది. అలా వెళ్తున్న పెళ్ళి కూతుర్ని చూసి బంధువులందరూ షాకయ్యారు. ఒక్కసారిగా పెళ్లిమండపంలో ఏం చెయ్యాలో తోచని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేది లేక అదే గ్రామానికి చెందిన మరో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అనుకున్న అమ్మాయి తన బట్టతలను చూసి వెళ్ళిపోతే అనుకోని అమ్మాయి తన భార్యగా వస్తుందని అస్సలు ఊహించలేకపోయాడతడు. ‘  అయినా పెళ్లి చూపులప్పుడు అమ్మాయికి అబ్బాయిని చూపించలేదా.. అప్పుడే చూపించుంటే ఇవాళ ఇలా అబ్బాయి పరువు పోయేది కాదు కదా  ’ అని బంధువులు చెవులు కొరుక్కున్నారట.