నాంపల్లి జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాను తిరస్కరించిన హైకోర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

నాంపల్లి జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాను తిరస్కరించిన హైకోర్ట్

April 19, 2018

సంచలనం సృష్టించిన హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన నాంపల్లి ఎన్ఐఏ కోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ రాజీనామాలో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన రాజీనామాను హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తోసిపుచ్చింది. రవీందర్ రెడ్డి పెట్టుకున్న తాత్కాలిక సెలవును హైకోర్ట్ రద్దు చేసింది. దీంతో ఆయన విధులకు హాజరయ్యారు. సోమవారం తీర్పు ఇచ్చి కొన్ని గంటలు గడవకముందే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు. అంతేకాకుండా 15 రోజులు తాను సెలవుపై వెళ్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇంతలోనే ఆయన రాజీనామాను హైకోర్ట్ తిరస్కరించటం గమనార్హం.