సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్ట్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్ట్ ఆగ్రహం

December 1, 2017

సివిల్‌ వివాదంలో బంజారాహిల్స్ పోలీసులు బలవంతంగా సంతకాలు సేకరించారని హైకోర్టులో ‌ఓ మహిళ పిటీషన్ వేసింది. ఆమె పిటీషన్‌కు హైకోర్ట్ స్పందిస్తూ పోలీసుల జోక్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని హైకోర్ట్ ప్రశ్నించింది. బంజారాహిల్స్ ఎస్‌హెచ్‌వో, ఎస్సై హరిందర్ ఈనెల 12న తమ ఎదుట హాజరు కావాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా మహిళ అరోపణలపై ఏసీపీ స్థాయి అధికారితో ఎంక్వైరీ చేయాలని హైదరాబాద్ సీపీకి ఆదేశించింది. ఈ నెల 12 కు విచారణను వాయిదా వేసింది.