పల్లెపల్లెనా రాముడి బొమ్మలు: వీహెచ్‌పీ - MicTv.in - Telugu News
mictv telugu

పల్లెపల్లెనా రాముడి బొమ్మలు: వీహెచ్‌పీ

November 29, 2017

అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసి 25 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విశ్యహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లు వార్షికోత్సవ సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశంలోని ప్రతీ గ్రామంలోనూ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు  పిలుపునిచ్చారు.

మార్చి 31,  2018న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి, అయోధ్యలో రామాలయాన్ని కచ్చింతగా  నిర్మించాలని ప్రతిన బూనాలని  నేతలు కోరారు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించాలని తాము ఏకగ్రీవంగా తీర్మానించామని వీహెచ్‌పీ శరద్ శర్మ వివరించారు.