జపాన్ బుల్లెట్ రైలు.. బీటలు వారి.. పట్టాలు తప్పింది.. - MicTv.in - Telugu News
mictv telugu

జపాన్ బుల్లెట్ రైలు.. బీటలు వారి.. పట్టాలు తప్పింది..

December 13, 2017

అత్యంత వేగంగా దూసుకుపోయే బుల్లెట్ రైలును భారత్‌లోనూ పరుగెత్తించాలని కేంద్ర సర్కార్ భావిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నది. అయితే ఈ బుల్లెట్ రైలు అస్సలు సురక్షితం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.  కారణం జపాన్ రాజధాని టోక్యోలోని షింకాన్‌షెన్  బుల్లెట్ రైలు ప్రమాదానికి గురైంది. ఓ బోగీ బీటలు వారడంతో రైలు పట్టాలు తప్పింది. బోగీలో మంటలు, పొగలు వ్యాపించాయి.  త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణహాని జరగకుండా అధికారులు ముందే ప్రమాదాన్ని పసిగట్టి రైలును ఆపేసారు. వెయ్యి మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం దక్షిణ జపాన్‌లోని నాగయ స్టేషన్‌ వద్ద రైలులో పొగలు రావడం, అలాగే విచిత్రంగా వస్తున్న శబ్దాలను అధికారులు గుర్తించి రైలును వెంటనే నిలిపేశారు. బుల్లెట్‌ రైలు వ్యవస్థలో ఇదో భారీ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు. రైలును పూర్తిగా పరిశీలించిన అధికారులు చాసిస్‌ కింద ఆయిల్‌ లీక్‌ అవడం వల్ల పొగలు వచ్చాయని చెబుతున్నారు.

మేము తేరుకోకుండా వుండి, రైలు ఇంకొంత దూరం వెళ్ళుంటే పరిస్థితులు అత్యంత దారుణంగా వుండేవంటున్నారు. రైల్లోని ప్రయాణీకులను మరో బుల్లెట్ రైల్లోకి తరలించారు. ఇది అసాధారణ సమస్య అని, దీని గురించి మేము సీరియస్‌గానే ఆలోచిస్తున్నామని షింకాన్‌షెన్ అధికారులు చుబుతున్నారు.ఇదిలా వుంటే.. ఈ షింకాన్‌షెన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సంస్థే.. భారత్‌లోనూ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఆ సంస్థకు చెందిన రైలే భవిష్యత్‌లో భారత్‌లో పరుగులు తీయనుంది.