జీవిత క్యాష్ కమిటీకి అనర్హురాలు.. సంధ్య - MicTv.in - Telugu News
mictv telugu

జీవిత క్యాష్ కమిటీకి అనర్హురాలు.. సంధ్య

April 19, 2018

జీవిత చేసిన వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త సంధ్య స్పందించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘ సినిమా రంగంలో కొత్తవారు రావాలి. కొత్తవారిని స్వాగతించాలి. వారసత్వ మాఫియా రూపుమాపాలి. కొత్త కొత్త అమ్మాయిలను తెస్తున్నారు సరే.. మరి కొత్త హీరోలను కూడా నార్త్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు తేరు ? వాళ్ళను ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేయరు ? తెలుగు అమ్మాయిలు హీరోయిన్లకు పనికిరారు అనుకుంటున్నారు మరి తెలుగు హీరోలు ఎలా పనికి వస్తారనుకుంటున్నారు ? తెలుగు హీరోయిన్లుగా నార్త్ వాళ్ళను తెస్తున్నారు. మరి తెలుగు హీరోలుగా అక్కడివాళ్ళను తేవచ్చు కదా. తెలుగు అమ్మాయిలను నచ్చజెప్పి ఇంటికి పంపానని జీవితగారు చెప్పారు.. అలా ఎందుకు పంపారని నేను అడుగుతున్నాను. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్ లేదనే కదా మీరు వాళ్ళను వెనక్కు పంపింది. జీవిత తన భాషను మార్చుకోవాలి. మీ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు.ఎందరో అమ్మాయిలు వచ్చి నా దగ్గర తమ  గోడు వెల్లబోసుకున్నారు కాబట్టి మేము ముందుకు వచ్చి పోరాడుతున్నాం. ఎన్నో సర్జరీలు చేసుకుని హీరోలుగా చెలామణి అవుతున్నారు. నాలుగైదు కుటుంబాల హీరోలే రాజ్యాలు ఏలుతారా ? ఎంతకాలం వీళ్ళను భరించాలి. క్యాష్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో వుంది. థియేటర్లు దొరకకపోతే అమ్మాయిలను పంపినట్టు మా దృష్టికి వచ్చింది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదంటే ఆ బాధ్యత ఎవరిది ? ఉద్యమాన్ని పక్కదోవ పట్టించటానికి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చి మాట్లాడితేనే కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడేవారికి భయం ఏర్పడుతుంది ’ అని అన్నారు.

జీవిత పెట్టిన కేసును ఎదురుకోవటానికి నేను సిద్ధంగా వున్నాను. ఆమె మీద కేసు పెట్టాలంటే ఎప్పుడో పెట్టేవారం అని స్పష్టం చేశారు. ఆమెను క్యాష్ కమిటీలో పెట్టడం సరికాదని అన్నారు. కాస్టింగ్ కౌచ్ లేదని అన్న ఆమెను ఎలా కమిటీలో పెడతారని నిలదీశారు. ఆమెకు ఈ సమస్యల మీద అవగాహనే లేదు కాబట్టి ఆమె ఈ కమిటీకి అనర్హురాలు అన్నారు సంధ్య.