నన్ను చంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను చంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది

March 21, 2018

‘ నన్ను చంపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ’ అంటూ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, శాసనసభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీని కోరుతూ, ఈ ఉదయం  ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు సంపత్‌తో కలసి ఢిల్లీ వెళ్లారాయన. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ నన్ను కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ చేసింది.నన్ను చంపేందుకే నా గన్‌మెన్లను నా దగ్గర నుంచి తొలగించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా నాకేం కాదు. అలాగే నాకేం జరిగినా అది ప్రభుత్వ బాధ్యతే అనేంత పిరికోణ్ణి కాను నేను ’ అని మండిపడ్డారు. కేసీఆర్ నీ గుండు కన్నా నా గుండె చాలా గట్టిదని సవాల్ విసిరారు.